Breaking News

ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలు

Published on Sun, 08/17/2025 - 19:00

భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటేసి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో ఒడిశాలో భారీ స్టాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వెల్లడించింది.

దేవ్‌ఘర్‌లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్థారించారు. అయితే సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్‌లలో మాత్రమే కాకుండా.. మయూర్‌భంజ్, మల్కన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్‌లలో అన్వేషణ పనులు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు.. ఒడిశాలో బంగారు నిక్షేపాల నిల్వలు ఎంత ఉన్నాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇది భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారం పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఇదీ చదవండి: 'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్

గత సంవత్సరం భారతదేశం 700 - 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశంలో గోల్డ్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఉత్పత్తి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. దిగుమతి కొంత తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)