Breaking News

ఆన్‌లైన్‌ మోసాలకు ఎయిర్‌టెల్‌ చెక్‌

Published on Fri, 06/13/2025 - 09:00

ఆన్‌లైన్‌ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్‌ చేసినట్లు పేర్కొంది.

ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్‌టెల్‌ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్‌గా ఎనేబుల్‌ చేసినట్లు భారతి ఎయిర్‌టెల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఈవో అజయ్‌ అనంతపద్మనాభన్‌ చెప్పారు. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ–మెయిల్స్‌ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్‌ చేస్తుందని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లకు వేగంగా ఆమోదం

స్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్‌టెల్‌ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సొల్యూషన్‌ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు.
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)