Breaking News

ట్రాయ్‌ ఎఫెక్ట్‌.. ఎయిర్‌టెల్‌ కొత్త చౌక ప్లాన్లు

Published on Sat, 01/25/2025 - 21:23

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను అనుసరించి దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) రెండు వాయిస్-ఓన్లీ చౌక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించాలని ట్రాయ్‌ ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ప్లాన్‌లను ప్రారంభించిన ఏడు రోజులలోపు ట్రాయ్‌ సమీక్షిస్తుంది.

ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్ తన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో ప్లాన్లను అప్‌డేట్ చేసింది. సవరించిన ఎయిర్‌టెల్‌ ప్లాన్లు ఇవే..

రూ.469 ప్లాన్‌
ఇది 84 రోజుల ప్లాన్. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండేది. దీన్ని ప్రస్తుతం రూ. 30 తగ్గించింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందించవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 900 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. ఎటువంటి డేటా అవసరం లేకుండా కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ సేవలు అవసరమయ్యే 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చారు.

రూ. 1849 ప్లాన్ 
ఇది 365 రోజుల ప్లాన్‌. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,959. రూ. 110 తగ్గించి రూ. 1,849 లకు తీసుకొచ్చింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ మాట్లాడవచ్చు. 
ఉచిత జాతీయ రోమింగ్, 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా దీర్ఘకాలిక వాయిస్, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం దీన్ని రూపొందించారు.

జియో ప్లాన్‌లు
ట్రాయ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించిన మొదటి టెలికం కంపెనీ రిలయన్స్ జియో. 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది. 84 రోజుల ప్లాన్‌ ధర రూ. 458. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 1,000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక 365-రోజుల ప్లాన్‌ ధర రూ. 1,958. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఆనందించవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)