Breaking News

మోసాలకు వ్యతిరేకంగా టెలికం కంపెనీల జట్టు!

Published on Mon, 05/26/2025 - 05:36

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న టెలికం మోసాలు, స్కామ్‌లకు వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడుదామంటూ రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా సంస్థలను ఎయిర్‌టెల్‌ కోరింది. సున్నితమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న టెలికం మోసాలకు వ్యతిరేకంగా పరిశ్రమ అంతా ఒక్కటై సమష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి, ట్రాయ్‌కి ఎయిర్‌టెల్‌ లేఖ రాసింది. 

2024 మొదటి తొమ్మిది నెలల్లో రూ.11,000 కోట్లకుపైగా ఆర్థిక నష్టంతో కూడిన 17 లక్షల సైబర్‌ నేరాలపై ఫిర్యాదులు నమోదు కావడాన్ని తోటి టెలికం కంపెనీల దృష్టికి తీసుకెళ్లింది. ఫోన్‌కాల్స్‌ ద్వారా ఓటీపీలు తెలుసుకోవడం, ఫిషింగ్‌ లింక్‌లు పంపడం ద్వారా డేటా చోరీ తదితర నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ఎయిర్‌టెల్‌ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్పామ్‌లు, మోసాలను గుర్తించే సొల్యూషన్లను ఎయిర్‌టెల్‌ కొన్ని వారాల నుంచి తన నెట్‌వర్క్‌ పరిధిలో అమలు చేస్తుండడం గమనార్హం.

 ‘‘ఫిషింగ్‌ దాడులు, హానికారక యూఆర్‌ఎల్‌ ఆధారిత స్కామ్‌లు ఇటీవలి కాలంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన నేపథ్యంలో.. పరిశ్రమ వ్యాప్తంగా మరింత సమన్వయంతో కూడిన చర్యలు అవసరం. టెలికం సేవల ప్రొవైడర్ల మధ్య సమన్వయ లోపాలను ఈ తరహా అత్యాధునిక మోసపూరిత పథకాలు ఉపయోగించుకుంటాయి’’అని ట్రాయ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లహోటి, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌కు రాసిన లేఖలో ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఉమ్మడి చర్యల దిశగా టెలికం సరీ్వస్‌ ప్రొవైడర్లను (జియో, వొడాఐడియా) ఈ నెల 14న సంప్రదించినట్టు తెలిపింది. అన్ని కంపెనీలు రియల్‌ టైమ్‌ ఫ్రాడ్‌ ఇంటెలిజెన్స్‌ పంచుకోవడం, నెట్‌వర్క్‌ల మధ్య సమన్వయంతో మోసాలను గుర్తించి, నిరోధించేందుకు ఈ చర్య చేపట్టినట్టు వివరించింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)