Breaking News

టాటా గ్రూపునకు మాయని మచ్చ..

Published on Thu, 06/12/2025 - 20:19

టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్‌ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.

బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారం
ప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్‌ను సమీక్షించడంలో టాటా గ్రూప్‌ నిబద్ధతను చైర్మన్‌ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.

టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్ర
టాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్‌ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్‌ నిర్మించింది.

  • జేఆర్‌డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియా
    ఎయిర్ ఇండియాను 1932లో జేఆర్‌డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది.  దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.

  • దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.

  • ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్‌ డాలర్ల  రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.

  • మెగా విలీనం - 2024 నవంబర్‌లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్‌ప్రెస్‌తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.

  • ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.

  • మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)