Breaking News

ఉప్పందించిన సొంత ఉ‍ద్యోగి.. ఎయిర్‌ఇండియాకు భారీ పెనాల్టీ!

Published on Wed, 01/24/2024 - 15:00

భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని దీర్ఘ-శ్రేణి, టెరైన్‌ క్రిటికల్‌ మార్గాల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన స్వచ్ఛంద భద్రతా నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ చర్య తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.

నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో ఎయిర్ ఇండియా నిర్వహించే విమానాల విషయంలో భద్రతా నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు ఎయిర్‌లైన్ ఉద్యోగి నుంచి స్వచ్ఛంద భద్రతా నివేదిక అందిందని, వాటిపై సమగ్ర దర్యాప్తును చేపట్టినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్‌.. దేశంలోనే తొలిసారి! 

ఎయిర్‌ ఇండియా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, దీంతో ఆ విమానయాన సంస్థ  అకౌంటబుల్ మేనేజర్‌కి షోకాజ్ నోటీసు జారీ చేశామని  డీజీసీఏ తెలిపింది. దీనికి ఎయిర్‌ ఇండియా నుంచి వచ్చిన స్పందనను సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించింది. లీజుకు తీసుకున్న విమానం కార్యకలాపాలు రెగ్యులేటరీ /ఓఈఎం పనితీరు పరిమితులకు అనుగుణంగా లేనందున ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు డీజీసీఏ వెల్లడించింది.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)