Breaking News

ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!

Published on Sat, 06/13/2026 - 17:10

అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్‌ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది.  ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.

ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్‌ 
ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్‌ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్‌ఆర్, పేరోల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ గోయల్‌ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్‌ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్‌ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్‌ గోయల్‌ పేర్కొన్నారు.

ఏఐతో ఉద్యోగాలు పోవు..
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్‌ఆర్, పేరోల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు.  దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్‌’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్‌ అట్‌ వర్క్‌ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్‌ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ సర్వేను నిర్వహించింది.

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)