Breaking News

టెక్‌ ఉద్యోగులకు ఊరట! సానుకూల విషయాన్ని చెప్పిన ఐఎల్‌వో

Published on Sun, 08/27/2023 - 21:51

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) రాక సంచలనాన్ని సృష్టించింది.  తర్వాత క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ సొంత ఏఐ సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదని, వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికి తోడు ఎలాన్‌ మస్క్‌ సహా అనేక టెక్‌ కంపెనీ అధినేతలు, సీఈవోలు సైతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. 

ఈ భయాందోళనల నేపథ్యంలో టెక్‌ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది ఐక్యరాజ్యసమితి (UN)కి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO). ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను రీప్లేస్ చేయలేదని ఐఎల్‌వో తాజా అధ్యయనం వెల్లడించింది.

ఐఎల్ఓ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ మనుషులు చేసే పనులను మార్చేస్తుంది తప్ప ఉద్యోగాలకు ముప్పు కాబోదు. అయితే ఏఐ రాకతో చాలా ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా యాంత్రీకరణకు గురవుతాయని ఐఎల్ఓ స్టడీ పేర్కొంది. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌ వల్ల ప్రయోజనమే తప్ప విధ్వంసం ఉండదని వివరిచింది. 

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలేం ఊడిపోవని, కాకపోతే పనిలో నాణ్యత, ఉద్యోగుల పనితీరు మెరుగు వంటి అంశాలకు దోహదం చేస్తుందని ఐఎల్ఓ అధ్యయనం పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం వివిధ ఉద్యోగాలు, ప్రాంతాలకు వేర్వేరుగా ఉంటాయని, పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉందని ఐఎల్ఓ స్టడీ అంచనా వేసింది.

ఇదీ చదవండి: ఏఐ ముప్పు లేని టెక్‌ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే..

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)