Breaking News

ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక

Published on Mon, 08/04/2025 - 07:45

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.

ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.

యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.

ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?

హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)