Breaking News

1.2 కోట్ల మందికి జాబ్‌ గండం.. గుబులు పుట్టిస్తున్న నివేదిక!

Published on Sun, 07/28/2024 - 09:37

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మానవ ఉద్యోగాలను హరించేస్తోంది. రానున్న రోజుల్లో సాధారణ ఉద్యోగాలు పొందడం చాలా కష్టతరం చేయబోతోంది. ముఖ్యంగా ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే పరిశ్రమలలో పనిచేసేవారికి ముప్పు తప్పదని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.

బిజినెస్ ఇన్‌సైడర్‌ కథనం ప్రకారం.. ఏఐ ఆగమనం కస్టమర్ సర్వీస్ రెప్స్, క్యాషియర్‌లు, ఆఫీస్ అసిస్టెంట్లు, ప్రొడక్షన్ వర్కర్లకు పెద్ద హెచ్చరిక. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన లేబర్ మార్కెట్, డిజిటల్ టెక్ పరిశోధకుడు జార్జియోస్ పెట్రోపౌలోస్ ప్రకారం, "మీడియం-స్కిల్డ్" కార్మికులు సాంకేతికత ద్వారా స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది.

అధిక-నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా తమ ప్రస్తుత ఉద్యోగాల్లోకి ఏఐని జోడించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్‌ల వంటివారి సేవలకు మాత్రం నిరంతర డిమాండ్‌ ఉంటుంది. ప్రధాన స్రవంతిలోకి ఏఐ మరింతగా చొచ్చుకుని రావడం వల్ల రానున్న దశాబ్దాల్లో మీడియం-స్కిల్డ్ కార్మికుల్లో అధిక నిరుద్యోగం ఏర్పడుతుందని  పెట్రోపౌలోస్ అంచనా వేస్తున్నారు. 20 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏఐతో నడిచే జాబ్ మార్కెట్‌కి మారుతుంది అంటున్నారాయన.

యూఎస్‌ జాబ్ మార్కెట్‌లో ఏఐ ప్రభావం కారణంగా తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు డిమాండ్‌ కోల్పోతారని అంచనా వేస్తున్నారు మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ క్వెలిన్ ఎల్లింగ్‌రూడ్. ఈయన ప్రకారం.. 2030 నాటికి 1.2 కోట్ల మంది ఉద్యోగులు వేరే కెరీర్‌లను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి 6,30,000 క్యాషియర్‌లు, 7,10,000 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌లు, 8,30,000 మంది సేల్స్‌ ఉద్యోగులు ఉపాధిని కోల్పోతారని మెకిన్సే అంచనా వేసింది. అన్ని పరిశ్రమల్లోని క్లర్క్‌ల సంఖ్య 1.6 కోట్లు తగ్గుతుందని ఈ సంస్థ గత ఏడాది ఒక నివేదికలో పేర్కొంది.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)