99 శాతం నిరుద్యోగులవుతారు.. ప్లాన్ బి ఉండదు

Published on Sun, 09/07/2025 - 16:21

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, తద్వారా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతుంది పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా లూయిస్‌విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ 'రోమన్ యాంపోల్స్కీ' (Roman Yampolskiy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోమన్ యాంపోల్స్కీ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) 2030 నాటికి 99 శాతం మంది కార్మికులను నిరుద్యోగులుగా చేస్తుందని అన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏఐ వ్యవస్థలనే ఉపయోగించుకుంటారని హెచ్చరించారు.

కోడింగ్ ఉద్యోగులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. చాలా రంగాల్లోని ఉద్యోగాలని ఏఐ భర్తీ చేస్తుంది. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాము. నేను 10 శాతం నిరుద్యోగం గురించి చెప్పడం లేదు. 99 శాతం ఉద్యోగాలు కోల్పోతారని చెబుతున్నానని ప్రొఫెసర్.. ది డైరీ ఆఫ్ ఎ సిఇఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. 2027 నాటికి 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (ఏజీఐ) వచ్చే అవకాశం ఉందని అన్నారు.

ఇదీ చదవండి: అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్

ఏజీఐ వచ్చిన మూడేళ్ళ తరువాత.. ఏఐ సాధనాలు, హ్యుమానాయిడ్ రోబోలు వస్తాయి. కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించుకునే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల కార్మిక మార్కెట్ కూలిపోతుందని చెప్పారు. "అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయి, అప్పుడు 'ప్లాన్ బి' ఉండదు. మీరు తిరిగి శిక్షణ పొందలేరు" అని రోమన్ యాంపోల్స్కీ అన్నారు.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)