ఏఐతో టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు 

Published on Sun, 10/12/2025 - 06:25

న్యూఢిల్లీ: భారత్‌లోని 245 బిలియన్‌ డాలర్ల విలువైన టెక్నాలజీ, కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ (అనుభవం) రంగాల్లో ఉద్యోగాల స్వరూపాన్ని కృత్రిమ మేథ (ఏఐ) సమూలంగా మార్చనుందని.. సత్వర చర్యలు అవసరమని నీతి ఆయోగ్‌ పేర్కొంది. లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్‌ (నాణ్యతకు హామీనిచ్చే) ఇంజనీర్లు, సపోర్ట్‌ ఏజెంట్ల ఉద్యోగాలు వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. ‘ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2031 నాటికి టెక్నాలజీ సేవల రంగంలో ఉపాధి సమూల మార్పులకు నోచుకోనున్నట్టు పేర్కొంది. అదే సమయంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 40 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు సైతం ఏఐ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. 

నైపుణ్య కల్పన, ఆవిష్కరణలతో.. ఏఐ ఉద్యోగాలైన ఎథికల్‌ ఏఐ స్పెషలిస్టులు, ఏఐ ట్రెయినర్లు, అనలిస్టులు, ఏఐ డెవ్‌ఆప్స్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్స్‌) ఇంజనీర్లకు భారత్‌ ప్రపంచ కేంద్రంగా అవతరించొచ్చని అభిప్రాయపడింది. ఏఐ కారణంగా ఏర్పడే అంతరాయాలను అవకాశాలుగా మలుచుకునేందుకు.. జాతీయ స్థాయిలో ఏఐ నైపుణ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఏఐ నైపుణ్యాలపై అవగాహన కల్పించడం, వొకేషనల్‌ కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో నైపుణ్యాల కల్పన, పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. విద్యా రంగం, ప్రభుత్వం, పరిశ్రమ మధ్య భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మందుకు నడిపించాలని కోరింది.  

విశ్వాసంతో కూడిన పన్ను వ్యవస్థ..  
నిబంధనలను స్వచ్ఛందంగా పాటించడం, పారదర్శకత, విశ్వసనీయమైన పాలనతో ఆధునిక పన్ను నిర్మాణం ఉండాలని నీతి ఆయోగ్‌ సూచించింది. దీనిపై చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఆధునిక, ఊహించతగిన (సులభతర), పౌరుల కేంద్రంగా పన్ను వ్యవస్థ అన్నది ఎంతో అవసమరని, ఇది సులభతర వ్యాపార నిర్వహణను, జీవనానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులను గౌరవించే విధంగా ఉండాలని, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాకారానికి అనుగుణంగా ఉండాలని సూచించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)