Breaking News

16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!

Published on Sun, 08/10/2025 - 19:26

చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.

భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 

11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.

ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్‌జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.

ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)