Breaking News

అనిల్‌ అంబానీ ‘డబుల్‌ ఫ్రాడ్‌’! మీద పడిన మరో బ్యాంక్‌

Published on Sun, 08/24/2025 - 17:47

పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీని చిక్కులు వెంటాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను "ఫ్రాడ్‌"గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించిన కొన్ని రోజులకే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా ప్రమోటర్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది.

రుణాలను దారి మళ్లించారని, మంజూరు నిబంధనలను ఉల్లంఘించారని, అంబానీతో పాటు కంపెనీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను తన నోటీసులో పేర్కొన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొంది. కాగా 2025 ఆగస్టు 22న ప్రభుత్వ రంగ సంస్థ బీఓఐ నుంచి తమకు లేఖ అందిందని ఆర్‌కామ్ అదే రోజున తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ ధీరూభాయ్ అంబానీ, మంజరి ఆషిక్ కక్కర్ ల రుణ ఖాతాలను రూ .724.78 కోట్లకు మోసంగా ట్యాగ్ చేసినట్లు బ్యాంక్ తన నోటీసులో పేర్కొంది.

తమ అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం లిమిటెడ్ (ఆర్టీఎల్)కు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేఖ వచ్చిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఫైలింగ్‌లో వెల్లడించింది. దీని ప్రకారం.. ఆర్టీఎల్, గ్రేస్ థామస్ (ఆర్టీఎల్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత కంపెనీ డైరెక్టర్), మరికొందరి రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరించాలని బ్యాంక్ నిర్ణయించింది.

బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. ఒక రుణ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించిన తర్వాత, క్రిమినల్ చర్యల కోసం దానిని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు పంపాలి. రుణగ్రహీత వచ్చే ఐదేళ్ల వరకు బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థల నుండి కొత్త రుణాలు తీసుకోకుండా నిషేధం ఉంటుంది.

ఇప్పటికే ఎస్‌బీఐ..
రుణ నిబంధనలను ఉల్లంఘించి ఆర్ కామ్ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ గత జూన్ లో స్టేట్ ఎస్‌బీఐ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు ఆర్‌కామ్‌కు సంబంధించిన కార్యాలయాలతో పాటు అనిల్ అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ అక్రమాలకు పాల్పడ్డారని, రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్‌బీఐ పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. అయితే ఈ ఆరోపణలను అనిల్ అంబానీ తన ప్రతినిధి ద్వారా ఖండించారు.

ఇదీ చదవండి: అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)