Breaking News

ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..

Published on Mon, 09/22/2025 - 11:19

కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీతోపాటు ఇతర సంస్థల్లోని దాదాపు అన్ని విభాగాల్లో ఏఐ పాగా వేస్తోంది. దాంతో ఉద్యోగాల్లో కోత తప్పడం లేదు. భవిష్యత్తులో ఏఐ ప్రభావంతో దాదాపు కనుమరుగయ్యే కొన్ని జాబ్స్‌ జాబితాను ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్‌ఆల్ట్‌మన్‌ తెలిపారు. దాంతోపాటు కొత్తగా సృష్టించబడే కొలువులను కూడా పేర్కొన్నారు.

ఏఐ వల్ల కనుమరుగయ్యే ఉద్యోగాలు

  • డేటా ఎంట్రీ క్లర్క్‌లు

  • బేసిక్ కస్టమర్ సర్వీస్ రిప్రెజెంటేటివ్స్‌

  • టెలిమార్కెటర్లు

  • ప్రాథమిక కాపీ రైటింగ్ స్కిల్స్‌ కలిగిన జాబ్స్‌

  • సింపుల్ గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యాలున్న ఉద్యోగాలు

  • సోషల్ మీడియా షెడ్యూలింగ్ కొలువులు

  • జూనియర్ కోడింగ్‌ ఉద్యోగాలు ఉదా: బగ్ ఫిక్సింగ్, టెంప్లెట్‌ ఆధారిత కొలువులు

ఏఐ కొన్ని విభాగాలను ఆటోమేట్‌ చేసే అవకాశం ఉన్నా, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో..

  • ఏఐ ఓవర్‌సైట్‌ ఉద్యోగాలు

  • ప్రాంప్ట్ ఇంజినీరింగ్

  • హ్యూమన్-ఏఐ కొలొబరేషన్‌ జాబ్స్‌

  • ఏఐ ట్రయినింగ్‌ జాబ్స్‌

  • ఏఐ వ్యవస్థల నైతికత, భద్రత, పాలన పరమైన ఉద్యోగాలు ఉన్నాయి.

ప్రభుత్వాలు, కంపెనీలు మార్పునకు సిద్ధం కావాలని, రీస్కిల్లింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆల్ట్‌మన్‌ సూచించారు.

ఇదీ చదవండి: ‘నేనో మేనేజర్‌ని.. టీమ్‌ సభ్యులకంటే జీతం తక్కువ’

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)