Breaking News

ముంబయి-ఢిల్లీ టికెట్‌ కంటే తులం బంగారం చీప్‌!

Published on Wed, 08/14/2024 - 15:09

భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. పెళ్లిళ్లు, పండగలు, పుట్టినరోజు, పెళ్లి రోజు..ఇలా ప్రత్యేక దినాల్లో మరింత స్పెషల్‌గా ఆత్మీయులకు ఆనందాన్ని పంచేందుకు బంగారాన్ని కొంటూంటారు. అంతేకాదు గోల్డ్‌ను స్థిరంగా వృద్ధి చెందే సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో ఇన్వెస్ట్‌ చేస్తారు. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్‌ పసిడి ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...

  • 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది.

  • 1947లో రూ.88.62 రెట్టింపు అయింది.

  • 1947లో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లే టికెట్‌ ధర కంటే 10 గ్రాముల బంగారం ధర తక్కువ.

  • స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో  10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.

  • 1950-60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.

  • 1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.184కు చేరింది.

  • 1980లో రూ.1,330కు, 1990 నాటికి రూ.3,200 దాటింది.

  • 2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది.

  • 2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటికీ 2000-2010 మధ్య కాలంలో బంగారం ధర రూ 4,400 నుంచి రూ.18,500 వరకు పెరిగింది.

  • 2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720.

  • 2023లో  రూ.60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్‌ చేసింది.

  • 2024 మేలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గరిష్ఠంగా రూ.76,450ను తాకింది. ప్రస్తుతం ఈరోజు(ఆగస్టు 14, 2024) రూ.71,150గా ఉంది.

బంగారం ధరను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..

  • గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ప్రభావం

  • భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు

  • ఆర్థికమాంద్యం భయాలు

  • ఆర్థిక, రాజకీయ పరిస్థితులు

  • ప్రభుత్వ విధానాలు

  • డాలర్‌ విలువ

  • ద్రవ్యోల్బణం


భారత్‌ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 44 శాతం స్విట్జర్‌ల్యాండ్‌ నుంచే వస్తోంది. తర్వాత యూనిటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి సుమారు 11 శాతం పసిడి దిగుమతి అవుతుంది. తర్వాత స్థానంలో సౌత్‌ ఆఫ్రికా, గినియా ఉంటాయి.

ఇదీ చదవండి: పెరుగుతున్న సౌర విద్యుత్‌ సామర్థ్యం

ఎక్కువ కొనుగోలు చేసేది ఎప్పుడంటే..

  • పెళ్లిళ్లు

  • పుట్టినరోజు

  • పెళ్లిరోజు

  • దీపావళి

  • ఆక్షయ తృతియ

  • దంతేరాస్‌

  • ఇతర ప్రత్యేక రోజులు, పండగలు
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)