Breaking News

కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్‌టెల్‌?

Published on Sun, 01/14/2024 - 13:15

ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్​లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌​లిమిటెడ్​ 5జీ డేటా ప్లాన్‌‌‌‌లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్​ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. 

టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్​ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్​లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌‌‌‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్‌​లిమిటెడ్​ డేటా ఆఫర్లతో పాటు  4జీ  ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్‌‌‌‌లను ప్రకటించవచ్చని  జెఫ్రీస్‌ ఒక రీసెర్చ్ ​నోట్‌లో తెలిపింది. ఎయిర్‌‌‌‌టెల్, జియో  5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది.

ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..

తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్‌‌‌‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్​ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్​పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి​ ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం  మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)