Breaking News

చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..

Published on Mon, 06/26/2023 - 21:05

Chinese Millionaire: చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించి ధనవంతుడవొచ్చు. ఇది సాధారణ ప్రజల ఫిలాసఫీ. అయితే కొంత మంది ఒక స్థాయికి చేరితే చదువును కూడా మధ్యలో ఆపేస్తారు. కానీ దానికి భిన్నంగా చైనాలో ఒక ధనవంతుడు ఒక పరీక్షను 27 సార్లుగా రాస్తూనే ఉన్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, చైనాకి చెందిన 56 సంవత్సరాల 'లియాంగ్ షి' (Liang Shi) అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 27 సార్లు రాసినట్లు తెలుస్తోంది. 'గావోకావో' అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రతిష్టాత్మకమైన సిచువాన్ యూనివర్సిటీలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పరీక్ష రాస్తున్నాడు. అయితే ఈ సారి కూడా అందులో సెలక్ట్ కాలేకపోయాడు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా లక్ష్యం చేరే వరకు ప్రయత్నం ఆపమని దీక్ష పట్టి కూర్చుకున్నాడు. 

(ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!)

నిజానికి లియాంగ్ చైనాలోని ధనవంతుల జాబితాలో ఒకరు. మిలీనియర్ అయినప్పటికీ ఎలాగైనా ఆ పరీక్షల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఉన్నత విద్యను పొందడం కోసం కష్టతరమైన పరీక్షలో విజయం సాధించాలనే తపనతో, రోజుకు 12 గంటల పాటు చదువుకుంటూ ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నాడు. 27 సార్లు ఒకే పరీక్ష రాస్తూ ఎంపిక కాకపోవడంతో ఎంతో మంది ఎగతాళి చేస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!)

గావోకావో (Gaokao)
గావోకావో అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష. దీని అసలు పేరు 'నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్' (NCEE). చైనాలో ఈ పరీక్షను గావోకావో అని పిలుస్తారు. ఈ ఎగ్జామ్‌ను సంవత్సరానికి ఒకేసారి మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇది ఒక అవసరం.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)