Breaking News

అపార్ట్‌మెంట్‌ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..

Published on Sun, 04/13/2025 - 09:46

అపార్ట్‌మెంట్‌ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇ‍చ్చింది. నెలవారీ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి అపార్ట్‌మెంట్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్‌డబ్ల్యూఏ)ల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.

జీఎస్టీ విధింపుపై అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలోని నివాసితుల్లో నెలకొన్న అయోమయంపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్‌డబ్ల్యూఏ మొత్తం టర్నోవర్ రూ.20 లక్షలు దాటకుండా అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటెనెన్స్ ఛార్జీల మొత్తం నెలకు రూ.7,500 దాటినా కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఇలా అయితేనే జీఎస్టీ
రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలోని  ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెన్స్‌ రూ.7,500 కంటే ఎక్కువ ఉండి ఆ అసోసియేషన్‌ వసూలు చేసే మెయింటెన్స్‌ మొత్తం కూడా సంవత్సరానికి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆర్‌డబ్ల్యూఏ తన సభ్యుల నుండి వసూలు చేసే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ లేదా కంట్రిబ్యూషన్‌పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇక హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు కలిగి ఉన్నవారికి తమ ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7,500 చొప్పున పరిమితిని వేర్వేరుగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక్కో సభ్యుడికి నెలకు రూ.7,500 దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు  మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక్కో సభ్యుడికి నెలకు రూ.9,000 అయితే రూ.1,500 వ్యత్యాసంపై కాకుండా మొత్తం రూ.9,000పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.

ఆర్‌డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూర్చడానికి 2018 జనవరి 18న జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్‌మెంట్‌ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ .5,000 నుండి రూ .7,500 కు పెంచింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)