Breaking News

మూడు ముక్కల టీడీపీకి మరో సంకటం

Published on Thu, 12/14/2023 - 05:28

సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్త సంకటం వచ్చి పడింది. అసలే మూడు వర్గాలతో, నిత్యం కొట్లాటలతో సతమతమవుతున్న టీడీపీకి జనసేనతో పొత్తు కారణంగా కొత్తగా మరో గ్రూపు చేరింది. రాజంపేట టీడీపీని మరింత రగిలిస్తోంది. పొత్తులో భాగంగా రాజంపేట టికెట్‌ తమకేనంటూ జనసేన నేతలు ఘంటాపథంగా చెప్పడం టీడీపీ నేతలకు చిర్రెక్కిస్తోంది. 

రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయాలని టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన అభ్యర్థిత్వానికి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు మోకాలడ్డుతున్నారు. బత్యాల నాన్‌ లోకల్‌ అభ్యర్థి, పోటీలో నిలిపినా నిరుపయోగమేనంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇంకోవైపు రాజంపేట ఎంపీగాకంటే అసెంబ్లీకి పోటీచేయాలని గంటా నరహరి ఉవ్విళ్లూరుతున్నారు. బత్యాల, జగన్‌మోహన్‌రాజులకు గట్టిగానే అడ్డం పడుతున్నారు. వీరు చాలదన్నట్టు తాజాగా పోలు సుబ్బారెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి రేసులోకి వచ్చారు. వీళ్ల మధ్య నిత్యం కొట్లాటలతో కేడర్‌ క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పుడు పొత్తులో మాకే సీటంటూ జనసేన నేతలు రంగంలోకి వచ్చారు.

రాజంపేట నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జి మలిశెట్టి వెంకటరమణ టిక్కెట్‌ తనదేనంటున్నారు. మలిశెట్టికంటే తానే మెరుగైన అభ్యర్థి అంటూ అతికారి దినేష్‌ మరోపక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చిన శ్రీనివాసరాజు తానే జనసేన అభ్యర్థినంటూ తెరపైకి వచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని తానేనంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నేతల కొట్లాటలతో టీడీపీ, జనసేన వర్గాలు కకావికలవుతున్నాయి. 

మైదుకూరు, రాజంపేట నేతల పైరవీలు 
టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకున్నా వైఎస్సార్‌ జిల్లా­లో మైదుకూరు, అన్నమయ్య జిల్లాలో రాజంపేటని జనసేనకు అప్పగించవద్దని టీడీపీ నేతలు పైరవీలు ఆరంభించారు. వాస్తవంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జన­సేన అభ్యర్థులను నిలిపే అవకాశం బలంగా ఉంది.

ఈ మేరకు ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, మైదుకూరు ప్రాంతాల్లో మా­త్రమే జనసేన సీట్లు కోరే అవకాశం ఉంది. రైల్వే­కోడూరు ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం కావడం, సరైన నాయకుడు లేకపోవడంతో రాజంపేట, మైదుకూరు సీట్లపై పట్టుబట్టనున్నారు. ఈ నేపథ్యంలో మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ రవీంద్రారెడ్డి జనసేన టికెట్‌పై పోటీ చేస్తారనే ప్రచారం ఉంది.  

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)