Breaking News

అక్రమ కేసు పెట్టి..

Published on Fri, 06/06/2025 - 06:02

ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.

తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్‌కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో  8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్‌పై బయటకు వచ్చారు.

తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్‌ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్‌పై ప్రైవేటు కంప్లయింట్‌ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్‌సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్‌స్టేషన్‌ మెయిన్‌ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. 

సీఐ మోహన్‌పై మృతుడి భార్య ఫిర్యాదు
ఖాజీపేట సీఐ మోహన్‌ తన భర్త  నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడప మేయర్‌ సురేష్‌ బాబు ఎస్పీ అశోక్‌ కుమార్‌ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)