Breaking News

నందికొట్కూరు మున్సిపాలిటీలో YSRCP ప్రభంజనం

Published on Tue, 11/03/2026 - 13:30

సాక్షి,నంద్యాల: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ  ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 వార్డులకు గాను, ఏకంగా 23కి పైగా వార్డులను కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  

ఇక నంద్యాల జిల్లాలోని బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. మొదటి రౌండ్‌ ముగిసే సమయానికి మొత్తం 28 వార్డులకు గాను 18 వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. బేతంచర్లలోనూ పార్టీ అభ్యర్థుల విజయం లాంఛనప్రాయమేననే సంకేతాలు వెలువడుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి వ్యూహాంతో 
బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార పర్వం మొదలుకొని ప్రతి అడుగులోనూ కేడర్‌ను ముందుండి నడిపిస్తూ స్థానిక రాజకీయాలను సమన్వయం చేసిన ఆయన వ్యూహం ఈ ఎన్నికల్లో మరోసారి సక్సెస్ అయింది. ఈ ఫలితాలతో నందికొట్కూరు గడ్డపై పార్టీ పట్టు నిరూపితమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

నందికొట్కూరులో బైరెడ్డి సంబరాలు

ఇదీ చదవండి : కుప్పంలో టీడీపీకి ఎదురుగాలి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)