Breaking News

కృష్ణా జిల్లాలో జనసేన దౌర్జన్యం.. దుకాణాలు కూల్చివేత

Published on Thu, 03/20/2025 - 18:10

సాక్షి, కృష్ణాజిల్లా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో జనసేన నేతల కక్ష సాధింపు చర్యలకు దిగారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై ఘంటసాల మండలం పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కుమార్‌ దాష్టీకానికి పాల్పడ్డాడు. మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పవన్ కుమార్.. అధికారులను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల దుకాణాలు తొలగించారు. సామాన్లు తీసుకుంటామన్నా వినకుండా జేసీబీలు తెచ్చి దుకాణాలను కూల్చివేయించారు. కరకట్ట రహదారికి ఆనుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు.

కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు అనే కారణంతో రెండు దుకాణాలను మాత్రమే తొలగించిన అధికారులు.. విలువైన సామాగ్రి ధ్వంసం చేశారు. దుకాణాలను కూల్చిన ప్రదేశాన్ని ఫెన్సింగ్ వేసి జనసేన నాయకులు ఆక్రమించుకున్నారు. జనసేన నాయకులపై బాధిత మహిళలు మండిపడ్డారు. ఐదేళ్లుగా ఇక్కడే పాక ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారం చేసుకుంటున్నామని.. సామాన్లు తీసుకుంటామన్నా అధికారులు ఒప్పుకోలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలమని కూడా చూడకుండా మాపై  జనసేన నాయకుడు పవన్ కుమార్ దౌర్జన్యం చేశారని.. కాళ్లమీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితులు వాపోయారు. లక్షల విలువైన మా సామాన్లను ధ్వంసం చేసేశారు. వైఎస్సార్‌సీపీ వాళ్లను బతకనివ్వమని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ల మీదకు వెళ్లమని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడా? అంటూ బాధిత మహిళలు ప్రశ్నించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)