Breaking News

నాగార్జున యాదవ్‌ అరెస్ట్‌

Published on Mon, 07/22/2024 - 08:26

సాక్షి చిత్తూరు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్థరాత్రి ఆయనను కుప్పం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నాగార్జునయాదవ్‌ ఓ టీవీ ఛానెల్‌ చర్చలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి కుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

దానిపై అక్కడి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కానీ, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అతన్ని అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. నాగార్జున యదావ్‌పై 196(1), 351(2)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతలోనే బెంగళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా  వికోట సమీపంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన  కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, పోలీసులిచ్చిన 41ఏకి కూడా విరుద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ తప్పుబడుతోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)