Breaking News

నకిలీ మద్యంపై వైఎస్సార్‌సీపీ రణభేరి

Published on Mon, 10/13/2025 - 04:47

సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, దానిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులకు వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ పత్రాలు సమర్పిస్తారు.

నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్‌ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్టుచేయాలని.. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేయనున్నారు. నకిలీ, కల్తీ మద్యంవల్ల చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరనున్నారు.

ఇక వైన్‌షాప్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలని డిమాండ్‌ చేయనున్నారు. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు­చేసిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దుచేసేలా ప్రభుత్వానికి ఎక్సైజ్‌ శాఖ సిఫార్సు చేయాలని నాయకులు డిమాండ్‌ చేస్తారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)