రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకోండి

Published on Sun, 05/04/2025 - 05:55

సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రూ.9 వేల కోట్లను బాండ్ల రూపంలో సేకరించడంలో భారీ అవకతవకలు ఉన్నాయంటూ ప్రజా ప్రయో­జన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వచ్చే నిధులను.. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఈ పిల్‌ వేశారు. 

రాష్ట్రంలోని 436 మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను పూర్తిగా ఏపీఎండీసీకి నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగిస్తూ ప్రభుత్వం ఏప్రిల్‌ 24న జారీ చేసిన జీవో 69ను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ జీవో అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అలాగే ఏపీఎండీసీ తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జారీ చేసిన జీవో 33ని కూడా అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో సవాల్‌ చేశారు. 

తన పరిధిలోకి వచ్చిన 436 మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను ఏపీఎండీసీ తన ఆస్తులుగా అప్పు ఇచ్చేవారికి గ్యారెంటీగా చూపనుందని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఏపీఎండీసీ షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులు తాకట్టులో పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. గనులను తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా ఇతరులకు లీజుకు ఇచ్చేందుకు, అమ్ముకునేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇది దోపిడీ కిందకే వస్తుంది..
ప్రభుత్వంతో సంబంధం లేకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను నేరుగా బాండ్ల కొనుగోలుదారులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం దారుణం అని అప్పిరెడ్డి అభివర్ణించారు. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల నిమిత్తం నిర్దేశిత ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం చొప్పున ప్రతి నెల ఉంచాలని, ఏ కారణంతోనైనా ఖజానాలో నిధులు తగ్గిపోతే ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు వెళ్లిపోతాయని చెప్పారు. 

ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ట్రెజరీ నుంచి డబ్బులు నేరుగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ నిధులను విచక్షణారహితంగా దోచిపెట్టడానికే ఈ జీవో తెచ్చారని, ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రజా విశ్వాసానికి, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బాండ్ల జారీతో సహా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకోవాలని హైకోర్టును కోరారు. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)