అడ్డంకులను అధిగమించి.. అణచివేతను ధిక్కరించి

Published on Tue, 12/16/2025 - 06:15

సాక్షి, అమరావతి : ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు.. చెక్‌పోస్టులతో అడ్డగింతలు.. పోలీసులకు ఆదేశాలు.. భగ్నం చేసేందుకు పన్నాగాలు..! ఇదీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు చేసిన కోటి సంతకాలతో సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకత్వం, శ్రేణులు నిర్వహించిన ర్యాలీలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు. కానీ, ప్రజలు వీటిన్నిటినీ దాటుకుంటూ ర్యాలీల్లో అశేషంగా పాల్గొన్నారు. కిలోమీటర్ల కొద్దీ దండుకట్టి సర్కారు దుర్మార్గంపై  దడపుట్టించారు. నిర్బంధాలను ఛేదిస్తూ, అడ్డంకులను దాటుకుంటూ విజయవంతం చేశారు.

వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపైంది. దీంతో ఎలాగైనా భగ్నం చేయాలని కుట్రలు పన్నింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ ర్యాలీలను నిలువరించాలని జిల్లా ఎస్పీ... సీఐ, ఎస్‌ఐలకు గట్టిగా చెప్పారు. దీంతో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు.  

⇒  ఇచ్ఛాపురంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ, పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మండపామ్‌ టోల్‌ గేట్‌ వద్ద మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సమన్వయకర్త పేరాడ తిలక్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టోల్‌ గేట్‌ నుంచి నిరసన ర్యాలీ తీశారు. 

⇒  వేలాదిమందితో ఆమదాలవలసలో సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ నిర్వహించిన ర్యాలీని పోలీసులు మూడుచోట్ల అడ్డుకున్నారు.  
⇒  శ్రీకాకుళం అరసవల్లి జంక్షన్‌లో నరసన్నపేట నాయకులతో వస్తున్న ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు.
⇒  విజయనగరం జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిర్బంధం విధించినా ప్రజలు లెక్కచేయలేదు. 

⇒  ఏలూరులో నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ చేసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ, పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో దూరాన్ని కుదించారు. 
⇒  కర్నూలులో పోలీసులు ఏకంగా నోటీసులు జారీచేసి అడ్డుకోవాలని చూశారు. కానీ, వీటిని లెక్కచేయకుండా ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా 
పాల్గొన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను ముక్కోటి గొంతుకలతో వ్యతిరేకించారు. ర్యాలీలతో కదంతొక్కారు.     

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)