Breaking News

‘ఆ సత్తా మీకు లేదా..? దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా?’

Published on Mon, 11/11/2024 - 15:59

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకూ నెరవేర్చలేదని, ఇక ఆ హామీలను అమలు చేసే యోచన కూడా వారికి లేదని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు (సోమవారం) వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో  పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌  మీడియాతో మాట్లాడుతూ..  ‘వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధనలు ఉంటే చూపించాలి. 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే సత్తా మీకు లేదా?.. మీరు చేసే దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా?, మాకు సమయం ఇవ్వకపోతే  ఏ విధంగా ప్రశ్నిస్తాం?. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ప్లాన్‌ చేశారు. 

కూటమి ప్రభుత్వం రూ. 57 వేల కోట్లు ఎందుకు అప్పు చేసింది.సూపర్‌సిక్స్‌ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు.  రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయి అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ చూసినా బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ విమర్శించారు.

అందుకే బడ్జెట్‌ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ దూరం
శాసన సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగా బడ్జెట్‌ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంది.  శాసన సభలో ​ కూటమి తర్వాత అత్యధిక ఓట్‌ షేరింగ్‌ ఉన్న వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా  గుర్తించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సభలో కూటమి తర్వాత తమదే అత్యధిక ఓటు షేరింగ్‌ ఉన్న పార్టీ అని స్పీకర్‌కు లేఖ రాసినప్పటికీ ప్రతిపక్షంగా   గుర్తించలేదు. గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసింది వైఎస్సార్‌సీపీ. 

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు

ఇది కూడా చదవండి: AP Budget 2024: కోతల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)