ఎగిసిపడ్డ ప్రజాగ్రహం

Published on Sat, 12/28/2024 - 04:34

సాక్షి, అమరావతి: కరెంట్‌ చార్జీలను పెంచబోమని... ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల షాకులిచ్చిన సీఎం చంద్రబాబు మోసాలపై ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. టీడీపీ కూటమి సర్కారు విద్యుత్తు చార్జీల బాదుడుపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వేధింపులు.. పోలీసుల బెదిరింపులకు వెరవకుండా.. నయవంచన పాలనను నిరసిస్తూ కిరోసిన్‌ లాంతర్లతో జన వాహిని కదం తొక్కింది. కరెంటు చార్జీలు పెంచి ఇప్పటికే వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

జనవరి నుంచి మోపనున్న రూ.­9,412.50 కోట్ల భారాన్ని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు మంగళం పాడిన ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదించారు. ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడాన్ని నరన­రాన జీర్ణించుకున్న చంద్రబాబు మోసాలను ఎండ­గడు­తూ విద్యుత్తు బిల్లుల బాదుడుకు నిరసనగా వైఎ­స్సార్‌ సీపీ శుక్రవారం నిర్వహించిన పోరుబాటకు ప్రజలు ఉప్పె­నలా కదలివచ్చారు. 

పోలీసుల ఆంక్షలకు వెరవకుండా కిరోసిన్‌ లాంతర్లు చేతబట్టి కూటమి ప్రభుత్వం చేసిన దగాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్‌ చార్జీల పెంపును వెంటనే రద్దు చేయాలి.. నయవంచక చంద్రబాబు డౌన్‌ డౌన్‌.. అంటూ గర్జించారు. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ వేలాది మంది కిలోమీటర్ల తరబడి విద్యుత్‌ శాఖ కార్యాలయాల వరకూ ర్యాలీగా కదిలి వచ్చారు. విద్యుత్‌ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించి అధికారులకు డిమాండ్‌ పత్రాలను అందజేశారు. ఈనెల 13న నిర్వహించిన రైతు పోరును మించి కరెంటు చార్జీల బాదుడుపై పోరుబాటలో జనం ఉద్యమించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. 



» కృష్ణా జిల్లాలో విద్యుత్‌­చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించా­రు. ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ స్పందన లభించింది. 
» విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలు హోరెత్తాయి.
» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘పోరుబాట’కు జనం పోటెత్తారు. బుచ్చిరెడ్డిపాళెంలో రెండు కిలోమీటర్ల మేర నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. 
»  ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోరుబాట నిరసన కార్యక్ర­మాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. 
»   తూర్పు గోదావరి జిల్లాలో కోటిపల్లి బస్టాండ్‌ నుంచి విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ కార్యాలయం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. 
»  పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో నిరసన ప్రదర్శన­ల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయ­కులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు, పాదయా­త్రలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించారు.  
»  వైఎస్సార్‌ జిల్లా కడప­లో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్‌ భవన్‌ వరకూ ప్లకా­ర్డుల­తో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వ­హించిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్య­కర్త­లు భారీగా పాల్గొన్నారు. అ­న్నమయ్య జిల్లాలో  విద్యుత్‌ పోరు కొనసాగింది.
» కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
» తిరుపతి నగరంలో నిరసన ర్యాలీ పద్మావతిపురంలోని భూమన కార్యాలయం నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం వరకూ సాగింది. నాయుడుపేట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నాగలాపురంలో ర్యాలీలు నిర్వహించారు.
» కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీగా విద్యుత్‌ కార్యాలయానికి చేరుకుని అధికారులకు డిమాండ్‌ పత్రాన్ని అందచేశాయి.
» చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కూడలి నుంచి ర్యాలీగా పీఎల్‌ఆర్‌ రోడ్డులోని ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయానికి చేరుకుని విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినదించారు. చిత్తూరు, నగరి, పూతలపట్టు, కార్వేటి నగరం, పలమనేరులో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)