Breaking News

మన్మోహన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల నివాళులు..

Published on Sat, 12/28/2024 - 12:20

సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు.

విశాఖలో మన్మోహన్‌ సింగ్‌ మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.

అనంతరం, బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల  కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్‌ చేశారు.

మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరం అని అన్నారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘దేశానికి మన్మోహన్‌ సేవలు మరువలేము. స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ..‘ఇండియాను గ్లోబల్ పవర్‌గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు అని తెలిపారు.

కుంభ రవిబాబు మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది. గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు అని చెప్పుకొచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)