Breaking News

‘అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?’

Published on Sat, 04/12/2025 - 17:09

తాడేపల్లి : టీటీడీ గోశాలలో ఆవులు చనిపోవడంపై నిజా నిర్దారణ కమిటీ వేయాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి కారణాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో నిజానిర్దారణ చేయాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం మాట్లాడిన మల్లాది విష్ణు.. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ధ్వజమెత్తారు. 

‘ఈరోజు కూడా కొందరు పాదరక్షలతో మహాద్వారం వరకు వెళ్లారంటే విజిలెన్స్ ఏం చేస్తోంది?, స్వామివారికి నైవేద్యం కూడా పది నిమిషాలు ఆలస్యంగా పెట్టారు. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?, గోమాతల మృతికి కారణం సరైన ఆలనాపాలన లేకపోవడమే. ఆహారం, పర్యవేక్షణ లేకనే గోవులు చనిపోయాయి.

టీటీడీ అధికారులు గోవుల మృతిపై ఎందుకు స్పందించలేదు?, సెలెబ్రిటీలే తప్ప సామాన్యులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండా చేశారు. టీటీడీని టీడీపీ ఆఫీసుగా మార్చారు. లోకేష్ పిఏ దందా కొండ మీద పెరిగి పోయింది. తిరుమలలో ఎగ్ పలావు దొరకటం, మద్యం దొరకటం ఏంటి?, క్యూలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?, గోమాత టీడీపీ వారికి పబ్లిసిటీ కావచ్చు, మాకు మాత్రం సెంటిమెంట్.  

గత చంద్రబాబు హయాంలో కూడా విజయవాడలో గోవులు చనిపోయాయి. టీడీపీ గోశాలలో గోవుల మృతిపై సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేయాలనుకోవటం గొప్ప విషయం. ఆయన పోరాటం ఆయన చేస్తారు. మేము కూడా గోవుల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాము. తిరుమలలో స్వామీజీలపై అరాచకంగా ప్రవర్తించారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలి. స్వామిజీలపై ఈ రకమైన కక్షసాధింపు మంచిది కాదు’అని మల్లాది విష్ణు హెచ్చరించారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)