Breaking News

జైళ్లు అడ్డంకి కాదు.. సోమిరెడ్డి దోపిడీని అడ్డుకుంటాం: కాకాణి

Published on Wed, 08/20/2025 - 10:33

సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్‌లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదు. నెల్లూరు జిల్లా ప్రజలే నా ఆస్తి. మాజీ మంత్రి(నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి) ఇంటిపై దాడి దుర్మార్గం. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం’’ అని కాకాణి అన్నారు. 

ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్‌ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్‌ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ లభించినట్లయ్యింది. బెయిల్‌పై ప్రాసిక్యూషన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. 

కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా.. కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు పెట్టిందని వైఎస్సార్‌సీపీ అంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాణి జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా.. ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు