Breaking News

ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి

Published on Sat, 12/13/2025 - 13:43

సాక్షి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. 

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)