Breaking News

జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విడుదల

Published on Thu, 01/29/2026 - 17:52

సాక్షి,విజయవాడ: అక్రమ మద్యం కేసులో అరెస్టై 226 రోజుల పాటు జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. చెవిరెడ్డికి పార్టీ నేతలు ఆయనకు పూలమాలలు వేసి, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా ఆహ్వానించారు.

జైలు విడుదల అనంతరం, చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు జైలు జీవితం తప్పదు. గతంలో చంద్రబాబు నాపై 72 కేసులు పెట్టారు. చంద్రగిరి నుంచి ఎదిగాను కాబట్టే చంద్రబాబు వేధిస్తున్నారు. గతంలో నన్ను చాలా అవమానకరంగా అరెస్టు చేశారు. కళ్లకు గంతలు కొట్టి నన్ను పోలీసులతో కొట్టించారు. చంద్రబాబు ఇప్పుడు నన్ను ఎనిమిది నెలల పాటు జైల్లో పెట్టారు. చంద్రబాబు పుట్టిన గ్రామంలో నేను పుట్టడం నా తప్పా.

చంద్రబాబు సొంత ఊరి నుంచి నా కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా కుమారులపై కేసులు పెట్టారు. మా కుటుంబ సభ్యులంతా  చంద్రబాబు బాధితులే. ఫైరవీలతో కాదు.. పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చా.1988 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. చంద్రబాబు ఎన్నికేసులు పెట్టిన బయపడను. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం వైఎస్సార్‌ నుంచి నేర్చుకున్నా. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటా. నేను భయపడను. అన్నింటికి కాలమే సమాధానం చెబుతోంది’ అని వ్యాఖ్యానించారు.   

మద్యం కేసులో గతేడాది జూన్‌ 17న చెవిరెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. అక్రమ కేసులు నమోదు చేయడంతో 226 జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

సిట్‌ అభియోగాలు
డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం.

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)