Breaking News

‘అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణం’

Published on Mon, 02/23/2026 - 15:13

విజయవాడ:  రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ  మానటరింగ్‌ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. 

శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 23వ తేదీ) మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్‌ చేశారు. 

గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు
పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బొత్స మరోసారి స్పష్టం చేశారు. బీఏసీలో మూడు అంశాలపై ప్రస్తావించామని, అందులో రైతులకు గిట్టుబాటు ధర కూడా ఒకటన్నారు. తిరుమల లడ్డూ అంశంపై కూడా చర్చ జరగాలని కోరామని,  కారు చౌకగా భూములు కేటాయింపులపై కూడా చర్చకు పట్టుబట్టునట్టి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబం సభ్యలు.. యూనివర్శిటీ పేరుతో విశాఖలో భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. 

వీడియో ఫుజేట్‌ను మాకు ఇవ్వాలని కోరాం
సభలో వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్‌ చూపించిన ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్‌ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్‌ను కోరామన్నారు బొత్స.

తిరుపతి నెయ్యి.. రాజమండ్రి పాల ఘటనపై బొత్స స్ట్రాంగ్ రియాక్షన్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)