Breaking News

అత్యాచారప్రదేశ్‌గా ఏపీ

Published on Tue, 12/23/2025 - 05:40

నెల్లూరు రూరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచారప్రదేశ్‌గా మార్చారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమ­వా­రం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం తనయుడు లోకేశ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు లైంగికదాడికి పాల్పడడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభు­త్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణి­ంచాయని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాసిన లేఖే నిదర్శనమన్నారు.  

జగన్‌ చేతల సీఎం.. బాబు మాటల సీఎం  
వైఎస్‌ జగన్‌ పాలనలో మహిళల భదత్రకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పూజిత గుర్తుచేశారు. దిశ యాప్‌ను పటిష్టంగా అమలు చేశారని, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. ఆపదలో అబలలు ఉంటే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలంలో ఉండేవా­రని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యా­క పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు.

నేరస్థులపై కఠినంగా వ్యవ­హరిస్తామని డైలాగ్‌లు చెప్పే చంద్రబాబు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశి్నంచారు. పోలీసులు అధికారపక్ష సేవలో తరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ము­ందు మహిళల రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చా­నన్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అమిత్‌షా సీఎం చంద్రబాబుకు లేఖరాశారని, దీనిపై ప్రజలకు సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)