Breaking News

‘సర్వేపల్లి’లో కోటి సంతకాలు సక్సెస్‌

Published on Mon, 11/17/2025 - 03:46

పొదలకూరు: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంత­కాల ఉద్యమం సర్వేపల్లిలో ఆదివారంతో పూర్తయింది. ఈ నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ లక్ష్యాన్ని ముందుగానే పూర్తిచేయడంతో ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది.

ఈ నెల 22 నాటికి సంతకాల సేకరణ పూర్తిచేయాల్సి ఉండగా, 16వ తేదీకే కాకాణి పూర్తిచేయించి ముగింపు సభను పొదలకూరు మండలం విరువూరులో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను ఖండిస్తూ సర్వేపల్లిలో పెద్దఎత్తున నిర్వహించిన ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలను పెట్టారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులయ్యారు. పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతుందని చాటిచెబుతూ కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు ఆయన కుమార్తె, పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత నియోజకవర్గంలో పర్యటించి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)