Breaking News

బీఆర్‌ నాయుడు వచ్చాకే తిరుమల గోశాల నిర్వీర్యం: భూమన

Published on Wed, 10/29/2025 - 13:34

సాక్షి, తిరుపతి: బీఆర్‌ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోషాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా? అని భూమన ప్రశ్నించారు.

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడే స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై  నిర్ణయం తీసుకుంటామంటున్నారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై, గోవుల మరణాలు జరుగుతున్నాయని చెప్పాను. దానికి నా మీద కేసులు పెట్టారు.

అందుకు బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డిని నాపై ఉసిగొల్పారు. గోశాలపై వ్యాఖ్యలు చేసిన మీకు కూడా ఈ కేసులే వర్తిస్తాయి. నా మీద పెట్టిన కేసులో మీ మీద కూడా పెట్టాలి. దాదాపు 70ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్‌ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు. గోశాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనే తప్పే కదా?. మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు. 

తిరుమలలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. దానికి మీరు పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు. ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత. తిరుమలలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)