Breaking News

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

Published on Mon, 11/09/2026 - 11:54

సాక్షి, గుంటూరు: కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల అనంతరం బస్సులో నుంచి వెంగళాయపాలెం బ్యాలెట్‌ బాక్స్‌ ఎందుకు దించారు? అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ములకత్ ద్వారా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పరామర్శించారు. అనంతరం, అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో దుష్ట సాంప్రదాయాలను తీసుకొచ్చారు. 

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. జైళ్లకు వెళ్లడానికి వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ భయపడరు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. లోకేష్ , పెమ్మసాని చిన్న ఘటనను అడ్డంపెట్టుకొని కేసుబెట్టడం దుర్మార్గం. ఏదో ఒక విధంగా అప్పిరెడ్డిని జైల్లో పెట్టాలని లోకేష్, పెమ్మసాని కుట్ర పన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నాయకులను జైల్లో పెట్టే పనిలో ఉంది.  

ఎన్నికల్లో అక్రమాలు చేసిన వారిని కాపాడుతున్నారు. బస్సులో నుంచి వెంగళాయపాలెం బ్యాలెట్‌ బాక్స్‌ ఎందుకు దించారు?. ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసిన బ్యాలెట్‌ బాక్స్‌ను ఎందుకు ఓపెన్‌ చేశారు?. ఇది బ్యాలెట్ బాక్స్ మార్చే ప్రయత్నం. ఒక్కసారి బస్సులో ఎక్కించిన బ్యాలెట్ బాక్స్‌ను మార్గం మద్యలో ఎందుకు దించారు?. మేము బ్యాలెట్ బాక్స్ పట్టుకోకపోతే తెలుగుదేశం వాళ్లు బాక్స్ మార్చేసేవారు. అన్యాయాన్ని అడ్డుకునేందుకు అప్పిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. అన్యాయాన్ని అడ్డుకున్న అప్పిరెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. అప్పిరెడ్డికి బెయిల్ రాకుండా  లోకేష్,పెమ్మసాని అనేక ప్రయత్నాలు చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ ఉంటాం’ అని హెచ్చరించారు.

లోకేష్ కి అంబటి వార్నింగ్.. వడ్డీతో సహా చెల్లిస్తాం

ఇదీ చదవండి: అధికార టీడీపీకి ఊహించని షాక్!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)