Breaking News

నేనున్నా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు జగన్‌ పరామర్శ

Published on Sat, 07/06/2024 - 07:37

వైఎస్సార్‌, సాక్షి: టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన..  కడప రిమ్స్‌కు వెళ్లి బాధితుడు అజయ్‌ను కలిసి నేనున్నాను అని ధైర్యం చెప్పారు.  

వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్‌.. నేరుగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. దాడి జరిగిన విధానం గురించి తెలుసుకున్న ఆయన.. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 

ఎయిర్‌పోర్టు వద్ద కోలాహలం
అంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్‌ రాకతో ఎయిర్‌పోర్ట్‌ వద్ద కోలాహలం నెలకొంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ  శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, అర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు. 

ఇక.. తన పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో ఉండనున్న జగన్‌.. పలువురు కార్యకర్తలు, నేతల్ని కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే వేడుక కార్యక్రమాల్లో జగన్‌ పాల్గొంటారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)