Breaking News

11న గుంటూరుకు వైఎస్‌ జగన్‌

Published on Mon, 09/09/2024 - 20:14

తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(సెప్టెంబర్‌ 11న) గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్‌ పరామర్శించనున్నారు.  టీడీపీ కార్యాలయం దాడి కేసు తిరగదోడి మరీ.. చంద్రబాబు ప్రభుత్వం సురేష్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్‌ చేయించిన సంగతి తెలిసిందే. 

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా  వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తోంది. ఈ క్రమంలో చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా ఉల్లంఘిస్తోంది.  రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే.. నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 

రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న YS జగన్

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ కేడరే కూటమి టార్గెట్‌

మూడేళ్ల క్రితం(2021) నాటి సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణలు చేశారు. దీంతో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన కేసును అధికారంలోకి రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెరిచింది. 

ఉద్దేశపూర్వకంగా.. కొంతమంది దగ్గరి నుంచి సాక్ష్యం పేరుతో స్టేట్‌మెంట్లు తీసుకుంది. ఆపై కొందరు వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి మరీ నిందితుల జాబితాను పోలీసులు ఈ కేసులో సిద్ధం చేయడం గమనార్హం. ఈ కేసులో సురేష్‌ పేరును 80వ నిందితుడిగా చేర్చింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)