Breaking News

ఏం స్కెచ్‌ వేశావ్‌ చంద్రబాబూ?: వైఎస్‌ జగన్‌

Published on Mon, 10/06/2025 - 03:00

2024–25 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్‌ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం రూ.6,782.21 కోట్లు. ప్రైవేట్‌ మద్యం షాపులు, ఊరూరా బెల్ట్‌ షాపులు, ఇతరత్రా విచ్చలవిడి అమ్మకాల నేపథ్యంలో 2025–26 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే. ఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ  లిక్కర్‌ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా చంద్రబాబూ?    
–మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం మాఫియా వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నకిలీ మద్యం తయారీ కేసులో అసలు సూత్రధా­రులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్‌ వేసి, రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

⇒ చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ గా  తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకానీ, లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.

⇒ మీ లిక్కర్‌ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, నకిలీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు.. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

⇒ లిక్కర్‌ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్‌లు పెట్టారు. తిరిగి మళ్లీ ఇల్లీగల్‌ బెల్టుషాపులు తెరిచి ప్రతి వీధిలోనూ పెట్టారు.

రాత్రి పగలు అనే తేడా లేకుండా లిక్కర్‌ అమ్మడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్‌ నివేదికల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్‌ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్‌ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్‌ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం?

⇒ నకిలీ లిక్కర్‌ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, నకిలీ బాటిళ్లను పట్టుకునే వారు. కానీ అలా జరగలేదు.

⇒ పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్‌ఛార్జి అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్‌ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్‌లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)