Breaking News

బాబు దగా పాలనపై రైతన్న తొలిపోరు విజయవంతం

Published on Sat, 12/14/2024 - 04:55

సాక్షి, అమరావతి: అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కార్‌ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌­సీపీ శుక్రవారం చేపట్టిన రైతు పోరును అడ్డుకునేందుకు చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని నాయకులు, రైతులపై బెదిరింపులు.. హౌ­స్‌ అరెస్టులకు దిగినా ఎక్కడా వెనకడుగు వే­యకుండా తమ డిమాండ్లు వినిపించడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ  శుక్రవారం రైతులతో కలసి భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొంటూ అన్నదాతలతో కలసి వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్లకు  డిమాండ్‌ పత్రాలను అందజేశారు. 

కూటమి సర్కార్‌ దగాను నిరసిస్తూ చేపట్టిన తొలి పోరాటం గ్రాండ్‌ సక్సెస్‌ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అభినందిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా తన ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

»  దగా పాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయింది. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరు నెలల కాలంలోనే చంద్రబాబుపై వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతకు ఇవాళ్టి కార్యక్రమం అద్దం పట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్‌ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. 

» చంద్రబాబూ..! ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్‌ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు ఎందుకు ఇవ్వడం లేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఈ–క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300–400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా?   

»   దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొస్తే.. ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డు పడటం చంద్రబాబు రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. 

»  మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సరి్టఫికెట్లను వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా వాటిని ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్‌ కార్యాలయాలకు రమ్మని చెప్పి అక్కడ  పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారితో దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థా­యిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచక పాలనకు నిదర్శనం కాదా? 
 


ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచి్చనవారిని నామినేట్‌ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు గప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేయడం నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)