Breaking News

కావాలనే నా సెక్యూరిటీ తగ్గించారు: వైఎస్‌ జగన్‌

Published on Wed, 07/16/2025 - 12:12

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రతీ ఆలోచనలోనూ కుట్రే ఉంటుందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. కుట్రలతోనే తన పర్యటనల్లో కావాలని ఉద్రిక్తతలు.. తన సెక్యూరిటీ తగ్గించారని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు మాకు సహకరించలేదు.. జెడ్‌ ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్‌లు పెట్టుకోవడం.. ఇవన్నీ హక్కులే కదా. మరి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలీదా?. కుట్రలతోనే నా పర్యటనల్లో ఉద్రికత్తలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు మాకు సహకరించలేదు. నాకు జెడ్‌ ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇవ్వడం లేదు. చంద్రబాబుకు నచ్చినప్పుడు సెక్యూరిటీ ఇస్తాడు.. ఇష్టం లేకపోతే సెక్యూరిటీ ఇవ్వడు అని తెలిపారు. 

పెడనలో సభ పెట్టిన నేతలందరిపై కేసులు పెట్టారు. నా పర్యటనలు అయ్యాక తప్పుడు కేసులు పెడుతున్నారు. మిర్చి యార్డుకు వెళ్లి రైతులకు సంఘీభావం తెలపడం తప్పా?. పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్తే కేసులు పెట్టారు. మా పార్టీ కార్యకర్త కురుబ లింగయ్యను చంపి, మా పార్టీ నేత తోపుదుర్తిపై కేసు పెట్టారు. మా వాళ్లను మేం పరామర్శించినా కేసులు పెడుతున్నారు. మళ్లీ చంద్రబాబే దాన వీర కర్ణ సినిమా రేంజ్‌లో యాక్టింగ్‌ చేస్తున్నారు. చంద్రబాబు యాక్టింగ్‌లో ఎన్టీఆర్‌ యాక్టింగ్‌ కూడా దిగదుడుపే’ అని సెటైర్లు వేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)