Breaking News

హైదరాబాద్‌ అభివృద్ధిలో బాబుకు సంబంధమే లేదు: వైఎస్‌ జగన్‌

Published on Thu, 10/23/2025 - 13:18

సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. హైదరాబాద్‌ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్‌ ఇస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ వచ్చాక హైదరాబాద్‌ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్‌ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం  అంటూ ఘాటు విమర్శలు చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్త తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ సైబర్‌ టవర్స్‌ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు. దాని పేరే హైటెక్‌ సిటీ. ఆరు ఎకరాల్లో హైటెక్‌ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్‌. కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు. హైదరాబాద్‌ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్‌ ఇస్తారు. 2004, 2009లో వైఎస్సార్‌ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబుకు, హైదరాబాద్‌కు సంబంధమే లేదు. కానీ, ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు.

2004లో వైఎ‍స్సార్‌ ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-1 ప్రారంభించారు. వైఎస్సార్‌ వచ్చాక హైదరాబాద్‌ రాత మారిపోయింది. ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించింది వైఎస్సారే. మహానేత వైఎస్సార్‌ హయాంలోనే జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం. బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌ 5650 కోట్లు. అదే వైఎస్సార్‌ వచ్చాక 2008-09 ఐటీ ఎగుమతులు 32509 కోట్లకు చేరింది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57000 కోట్లుగా ఉంది. కేసీఆర్‌ కూడా గొప్ప పరిపాలన అందించారు. కేసీఆర్‌ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్‌మెంట్‌ జరిగింది. కానీ, ఈ క్రెడిట్‌ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు. క్రెడిట్‌ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం’ అని విమర్శలు చేశారు. 

2004లో నువ్వు ఓడిపోయినా తర్వాత.. హైటెక్ సిటీపై జగన్ షాకింగ్ నిజాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)