Breaking News

అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన: వైఎస్‌ జగన్‌

Published on Mon, 06/23/2025 - 03:14

సాక్షి, అమరావతి: అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కారు మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరి తెగించిందని వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జారీ చేసే ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌) బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్‌ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ (సంచిత నిధి)పై అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. ఏపీఎండీసీకి ఎన్‌సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.

ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేస్తూ ఆదివారం ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్‌ 24న ఎన్‌సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసు­కున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్‌ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలోని 203, 204 అధికరణ (ఆరి్టకల్‌)లను ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అను­మతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 293(1)ని ఉల్లంఘించడమే.

ఎన్‌సీడీ బాండ్‌ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమంటే దారుణం. దీనికి అదనంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్‌సీడీ బాండ్‌ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీ­సులు జారీ చేసినట్లు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసా­గించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరి కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమే. భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే’’.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)