Breaking News

YS Jagan: శ్రీనివాసరావుకు పరామర్శ.. విశాఖ నేతలతో కీలక భేటీ

Published on Mon, 08/05/2024 - 19:00

సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తున్నారు. తాజాగా.. టీడీపీ శ్రేణుల చేతిలో మూక దాడికి గురైన  గింజుపల్లి శ్రీనివాసరావును జగన్‌ పరామర్శించనున్నారు. 

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలే ఆయనపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్నారు జగన్‌. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉంది.
 
ఇక.. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయనున్నారు. బుధ, గురువారాల్లో వరుసగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు కుటిల రాజకీయాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఆయన అప్రమత్తం చేయనున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేని భరోసా ఇస్తూనే.. ఎన్నికల్లో వ్యవహారించాల్సిన తీరును ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)