రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం

Published on Tue, 01/13/2026 - 13:48

సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.

కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్‌పేట్‌ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్‌ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్‌ఎస్‌ మూర్తి కుమారులు, కుమార్తె రమా­దేవి ఉన్నారు.

గతేడాది డిసెంబర్‌ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు.  మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్‌ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)