Breaking News

ఇవి ఎన్నికలు కావు.. కేవలం సెలక్షన్లు మాత్రమే: వైఎస్‌ జగన్‌

Published on Tue, 11/03/2026 - 19:21

సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికల తీరుపై, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు గూండారాజ్ పాలనపై జగన్ పైర్ అయ్యారు. ఎస్ఈసీ తీరును కూడా తప్పు పడుతూ ట్వీట్ చేశారు వైఎస్‌ జగన్.  ఇవి ఎన్నికలు కావని.. కేవలం సెలక్షన్లు మాత్రమేనని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.  

‘‘చంద్రబాబు నాయుడి టీమ్‌కు, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు! ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేసి ఎన్నికల్లో ఘన విజయం ఎలా సాధించాలో మీరు నిరూపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు అత్యవసరం. దేశంలో ఎన్నికల సంస్కరణల అవసరమనే విషయం ఇంతకంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలే..
- నామినేషన్: హ్యాక్‌ చేశారు!
- నామినేషన్ల పరిశీలన:  హ్యాక్‌ చేశారు!
- ఉపసంహరణ:  హ్యాక్‌ చేశారు!
- పోలింగ్ ఏజెంట్లు: అడ్డుకున్నారు, బలవంతంగా బయటకు పంపించారు!
- పోలింగ్: అక్రమాలకు పాల్పడ్డారు!
- పోలింగ్ శాతం: తారుమారు చేశారు!
- ఓట్ల లెక్కింపు: హ్యాక్‌ చేశారు!

అభ్యర్థులను మీరే ఎంపిక చేశారు.. ప్రజలు ఎన్నడూ వారిని ఎన్నుకోలేదు! ఇవి ఇక ఎన్నికలు కావు.. కేవలం సెలక్షన్స్‌ మాత్రమే’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఇదీ చదవండి: లాటరీ పద్ధతిలో విజేత.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)