Breaking News

ఇవేం ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిద్రపోతుందా?: అవినాష్‌ రెడ్డి

Published on Sun, 11/01/2026 - 10:08

సాక్షి, పులివెందుల: ఏపీలో ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. పులివెందులలో టీడీపీ గూండాల దాడులు, పోలీసుల తీరుపై అవినాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులే ఓటర్లను అడ్డుకుంటున్నారు. వందల మంది బయట వ్యక్తులు పులివెందులకు వచ్చారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మా అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని టీడీపీ చూస్తోంది. ఇంత జరుగుతున్నా ఎస్‌ఈసీ నిద్రపోతుందా? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. పులివెందులలో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓటర్లను పచ్చమూకలు అడ్డుకుంటున్నాయి. పులివెందుల 11, 12  బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు రాళ్లు విసురుతున్నారు. బూత్‌లకు ఎవరూ రాకుండా పచ్చమూకలు అడ్డుకుంటున్నారు. పులివెందులలో 20 వార్డుల్లో టీడీపీ గూండాలు మకాం చేశారు. అన్ని పోలింగ్‌ బూతులను టీడీపీ నేతలు ఆక్రమించారు.

పులివెందులలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ గూండాలు.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పచ్చమూకలు ఖూనీ చేస్తున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పులివెందుల బాయ్స్ జూనియర్‌ కాలేజీ వద్ద ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్‌ బూత్‌ వద్ద 400 మంది ఓటర్లు బైఠాయించారు. తమ ఓట్లు టీడీపీ నేతలే వేస్తున్నారని ఓటర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓటర్లపై డీఎస్పీ మురళీ నాయక్‌ బెదిరింపులకు దిగారు. వెళ్లిపోండి.. ఓట్లు వేయొద్దు అంటూ బెదిరించిన డీఎస్పీ..  మీకు ఓటు వేసే హక్కు లేదంటూ ఓటర్లకు డీఎస్పీ వార్నింగ్‌ ఇచ్చారు. ఓటర్లకు రక్షణ కల్పించకుండా పోలీసులు వెనక్కి పంపుతున్నారు. అనంతరం డీఎస్పీని మహిళలు నిలదీయడంతో మురళీ నాయక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

ఇదీ చదవండి: డీఎస్పీ బెదిరింపులు.. తిరగబడ్డ మహిళలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)